మన తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతి ఏడాది సంక్రాంతి, దసరా పండుగలకు ఒకింత భారీగా సినిమాలు రిలీజ్ అయి ఆడియన్స్ కి ఫ్యాన్స్ కి వీనుల విందుని అందిస్తూ ఉంటాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతికి ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ అయి మంచి విజయం అందుకోగా రానున్న దసరా రిలీజ్ పై ఇప్పటి నుండే పలు సినిమాల మేకర్స్ ప్లాన్స్ చేసుకుంటున్నారు.
ఆ విధంగా ఇప్పటికే దసరా బారిలో బెర్త్ ని ఖాయం చేసుకున్న మూవీ ఎన్టీఆర్, కొరటాల శివ ల దేవర పార్ట్ 1. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఇక నాగచైతన్య, సాయి పల్లవి ల కలయికలో చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న పేట్రియాటిక్ యాక్షన్ మూవీ తండేల్ కూడా దసరాకి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ఇటీవల దర్శకుడు చందూ మాట్లాడుతూ చెప్పారు.
ఇక లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ ప్రకారం నటసింహం బాలకృష్ణ తో బాబీ తెరకెక్కిస్తున్న యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ మూవీ కూడా దసరా బరిలో నిలవనున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ యొక్క రిలీజ్ కి సంబంధించి త్వరలో అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని టాక్. మరి అదే నిజం అయితే దసరా బరిలో టాలీవుడ్ నుండి మొత్తం మూడు బడా మూవీస్ మధ్య బాక్సాఫిస్ క్లాష్ తప్పదని అంటున్నారు సినీ విశ్లేషకులు.