టాక్..”RRR” టోటల్ రన్ టైం అంత వచ్చిందా.?

Published on Nov 26, 2021 1:00 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రల్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఇప్పుడు అదిరే ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇక ఒక పక్కా ప్రణాళికతో రానున్న రోజుల్లో కీలక అప్డేట్స్ తో రానున్న ఈ సినిమాపై ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది.

మామూలుగానే రాజమౌళి సినిమాలు 2 గంటల 50 నిమిషాలకు తగ్గకుండానే ఉంటాయి. అలాగే ఈ సినిమాకి కూడా దగ్గరగా మూడు గంటల నిడివి వచ్చేసిందట. సినిమా ఎలా చూసుకున్నా 3 గంటలు ఖచ్చితంగా వస్తుందట. మరి విజువల్ గా మూడు గంటల సేపు రాజమౌళి ఏ రేంజ్ ట్రీట్ ని అందిస్తారో తెలియాలి అంటే వచ్చే జనవరి 7 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

More