టాక్..”సార్పట్ట 2″ కి అతడి వర్క్ ఉండదా?

Published on Mar 7, 2023 2:00 pm IST

గత కరోనా టైం లో అనేక ఇంట్రెస్టింగ్ చిత్రాలు అన్నీ కూడా ఓటిటి లోనే రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. వాటిలో కొన్ని చిత్రాలు మాత్రం థియేటర్స్ లో రిలీజ్ చేసి ఉంటే బాగున్ను అని ఫీల్ అయ్యినవారు కూడా చాలా మంది ఉన్నారు. మరి అలాంటి చిత్రాల్లో దర్శకుడు పా రంజిత్ ఆర్య హీరోగా చేసిన ఇంట్రెస్టింగ్ పీరియాడిక్ బాక్సింగ్ డ్రామా “సార్పట్ట” కూడా ఒకటి. అయితే ఈ చిత్రం పా రంజిత్ కెరీర్ లో బెస్ట్ వర్క్ గా నిలవగా తెలుగు ఆడియెన్స్ ని కూడా ఈ చిత్రం అమితంగా ఇంప్రెస్ చేసింది.

అయితే నిన్ననే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి రెండో భాగాన్ని కూడా అనౌన్స్ చేయగా ఈ అప్డేట్ క్రేజీ గా మారింది. అయితే ఈ అనౌన్సమెంట్ తో పాటుగా ఓ ఊహించని టాక్ కూడా తమిళ సినీ వర్గాల నుంచి అయితే మొదలైంది. మొదటి సినిమాకి తన మ్యూజిక్ తో ప్రాణం పోసిన సంతోష్ నారాయణన్ అయితే ఈ కొత్త సినిమాకి వర్క్ చేయడం లేదని రూమర్స్ తమిళ్ సినీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :