టాక్..తెలుగు రాష్ట్రాల్లో ముందే “RRR” బొమ్మ పడనుందా..?

Published on Mar 9, 2022 11:55 am IST

పాన్ ఇండియా వీక్షకులు ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ సినిమాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ భారీ సినిమాని బిగ్ స్క్రీన్స్ పై విట్నెస్ చెయ్యడానికి అభిమానులు అయితే ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమా స్పెషల్ షో కి సంబంధించి టాక్ వినిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రత్యేక షో లు ఉంటాయా లేదా అనేది ఆసక్తిగా మారగా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ బజ్ మొదలైంది. దీని ప్రకారం అయితే ఏపీ మరియు తెలంగాణాలో మార్చ్ 24 రోజు నైట్ నుంచే “RRR” బొమ్మ పడే అవకాశం ఉందని టాక్. ప్రస్తుతానికి అయితే ఇందులో ఇంకా ఎలాంటి నిజం లేదు కానీ మరి దీనిపై అధికారిక క్లారిటీ వస్తే అభిమానులకి కూడా లైన్ క్లియర్ అవుతుందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :