టాక్..”ఇండియన్ 2″ షూట్ ముందే స్టార్ట్ అవనుందా.?

Published on Jul 28, 2022 2:00 am IST

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ చిత్రం “విక్రమ్” తో తన కెరీర్ లోనే కాకుండా తమిళ్ బాక్సాఫీస్ దగ్గర కూడా భారీ హిట్ గా నిలిచింది. ఇక కమల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లపై ఆటోమాటిక్ గా అంచనాలు పెరిగాయి. ఇక కమల్ లైనప్ లో ఉన్న చిత్రాల్లో దర్శకుడు శంకర్ తో చేస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “ఇండియన్ 2” కూడా ఒకటి.

మరి దీనిని అయితే విక్రమ్ కన్నా ముందే రిలీజ్ చెయ్యాల్సి ఉండగా పలు కారణాల చేత మేకర్స్ మధ్యలో ఆపాల్సి వచ్చింది. ఇక ఈ సినిమాకి ఫైనల్ గా లైన్ క్లియర్ అవ్వడంతో షూటింగ్ కి కూడా మళ్ళీ రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ షూటింగ్ మొదట ఈ ఏడాది చివర స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని బజ్ బయటకి వచ్చింది.

కానీ ఇప్పుడు లేటెస్ట్ గా అయితే ఈ సినిమా షూటింగ్ ని మేకర్స్ సెప్టెంబర్ నుంచే మొదలు పెట్టాలని చూస్తున్నారట. అందులో భాగంగానే కమల్ కూడా ప్రిపేర్ అవ్వడానికి యూఎస్ వెళ్లినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి మొత్తానికి అయితే ఈ అవైటెడ్ సినిమా కాస్త ముందే రీస్టార్ట్ అవ్వనుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :