టాక్.. మరోసారి “ఫిదా” కాంబినేషన్?


మన టాలీవుడ్ లో ఉన్నటువంటి కొన్ని క్రేజీ హిట్ కాంబినేషన్ లలో మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ కూడా ఒకటి. మరి కలయికలో వచ్చిన ప్రేమ కథా చిత్రం “ఫిదా” సెన్సేషనల్ హిట్ అయ్యింది. అంతే కాకుండా హీరోయిన్ గా సాయి పల్లవి కి కూడా టాలీవుడ్ లో భారీ వెల్కం దక్కింది. అయితే లేటెస్ట్ గా కొన్ని రూమర్స్ మళ్లీ ఫిదా కాంబినేషన్ రిపీట్ కానున్నట్టుగా చెబుతున్నాయి.

అయితే ఈ ముగ్గురూ కాదు కాని శేఖర్ కమ్ముల, వరుణ్ తేజ్ కలయికలో ఓ బ్యూటిఫుల్ సినిమా ఉండబోతుంది అని వినిపిస్తోంది. మరి ఈ హిట్ కాంబినేషన్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉన్నాయి. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ తన “మట్కా” సినిమాలో బిజీగా ఉండగా, సాయి పల్లవి బాలీవుడ్ లో “రామాయణం”, తెలుగులో ‘తండేల్” లాంటి భారీ చిత్రాలు చేస్తోంది. అలాగే శేఖర్ కమ్ముల కోలీవుడ్ హీరో ధనుష్ తో “కుబేర” లో బిజీగా ఉన్నారు.

Exit mobile version