టాక్..”మగధీర” రీ రిలీజ్ ఆగిందా.?

Published on Mar 16, 2023 7:10 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు మావెరిక్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ సినిమా చేస్తున్నాడు. అలాగే మరో పక్క తాను నటించిన లాస్ట్ భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాక తాను యూఎస్ నుంచి ఇప్పుడు ఇండియాకి రాబోతున్నాడు. మరి ఈ మార్చ్ లోనే ఈ ఆస్కార్ పైగా శంకర్ సినిమా నుంచి భారీ అప్డేట్ తో పాటుగా తన బర్త్ డే సందర్భంగా అయితే తన కెరీర్ సహా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన హిస్టారికల్ చిత్రం “మగధీర” ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ వారే అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మరో టాక్ ఇపుడు వినిపిస్తుంది. మేకర్స్ అయితే ఈ సినిమా రీ రిలీజ్ ని ఆపేసినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. అయితే చరణ్ బర్త్ డే ప్లాన్ లో ఈ సినిమా స్థానంలో చరణ్ ప్లాప్ అండ్ కల్ట్ క్లాసిక్ చిత్రం “ఆరెంజ్” అయితే రీ రిలీజ్ చేస్తున్నట్టుగా సన్నాహాలు చేస్తున్నట్టుగా లేటెస్ట్ బజ్. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :