కార్తీ “జపాన్” ప్రీపోన్ కాబోతుందా?

Published on May 16, 2023 11:00 am IST

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “సర్దార్” తో తాను సాలిడ్ కం బ్యాక్ అందుకోగా ఈ చిత్రం తెలుగులో కూడా భారీ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత తాను హీరోగా అనౌన్స్ చేసిన సినిమానే “జపాన్”. కొత్త దర్శకుడు రాజు మురుగన్ అయితే తెరకెక్కిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ చిత్రం తో కార్తీ డిఫరెంట్ లుక్స్ లో అయితే కనిపిస్తున్నాడు.

ఇక ఈ చిత్రాన్ని అయితే మేకర్స్ ఈ ఏడాది దీపావళి కానుకగా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రేస్ లో భారీ పోటీ నెలకొనగా మేకర్స్ ఈ రేస్ నుంచి తప్పుకొని సినిమాని ప్రీ పోన్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ సినిమా దీపావళి రేస్ నుంచి అయితే వినాయక చవితి కానుకగా రిలీజ్ చేయనున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఇక రీసెంట్ గానే శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం మహావీరుడు కూడా ప్రీ పోన్ అయ్యిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :