టాక్..”లియో” వర్సెస్ “సూర్య 42” పడబోతుందా?

Published on Mar 9, 2023 8:01 am IST

ప్రస్తుతం కోలీవుడ్ సినిమా నుంచి భారీ అంచనాలతో ఉన్న పలు పాన్ ఇండియా సినిమాల్లో ఇళయ దళపతి విజయ్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగ రాజ్ తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ చిత్రం “లియో” ఒకటి కాగా మరొకటి అయితే స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న తన 42వ సినిమా కూడా ఒకటి. మరి దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ ప్రాజెక్ట్ భారీ హైప్ తో గ్రాండ్ పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ రెండు సినిమాల తాలుకా ప్రీ రిలీజ్ బిజినెస్ లు ఒకదాన్ని మించి ఒకదానికి జరుగుతూ ఉండడం విశేషం. అయితే ఇక థియేట్రికల్ గా కూడా ఈ రెండు భారీ సినిమాలకి క్లాష్ పడేలా ఉందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఆల్రెడీ విజయ్ లియో సినిమా అక్టోబర్ 19కి ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సూర్య మాసివ్ ప్రాజెక్ట్ కూడా ఇదే సమయానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కి పోటీ తప్పనిసరిలా ఉందని లేటెస్ట్ టాక్. మరి ఈ అవైటెడ్ సినిమాలు ఒకే సమయంలో వస్తాయా రావా అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :