టాక్..ఓటిటి లోకి దిగనున్న ఐకాన్ స్టార్..?

Published on Jan 20, 2022 3:01 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఇప్పుడు సోషల్ మీడియా సహా సినీ వర్గాల్లో ఏ రేంజ్ లో వినిపిస్తుందో చూస్తూనే ఉన్నాము. తాను నటించిన లేటెస్ట్ సినిమా “పుష్ప ది రైజ్” థియేటర్స్ లో భారీ వసూళ్లు అందుకొని కొన్ని రోజులు కితమే అన్ని భాషల్లో ఓటిటి రిలీజ్ కూడా అయ్యి మరింత సాలిడ్ టాక్ తో దూసుకెళ్తుంది. అయితే ఈ ఓటిటి వెర్షన్ కే వస్తే అల్లు అర్జున్ కుటుంబం నుంచే ఒక స్ట్రీమింగ్ యాప్ “ఆహా” ఉన్న సంగతి అందరికీ తెలుసు.

అలాగే ఈ యాప్ కోసం అల్లు అర్జున్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఏ పాటి ప్రమోషన్స్ లో పాల్గొన్నాడో కూడా తెలిసిందే. కానీ లేటెస్ట్ గా మాత్రం ఓ టాక్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇందులో ఎంతవరకు నిజముందో కానీ తమ ఆహా కోసం అల్లు అర్జున్ అయితే ఒక టాక్ షో కి హోస్ట్ గా చేయనున్నాడని వినిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే దీనిపై ఎలాంటి అధికారిక అప్డేట్ లేదు.. మరి వేచి చూడాలి దీనిపై ఏమన్నా ప్రోగ్రెస్ వస్తుందో లేదో అనేది.

సంబంధిత సమాచారం :