టాక్..”స్పైడర్ మ్యాన్ నో వే హోమ్” ఓటిటి రిలీజ్ కి డేట్ ఫిక్స్.!

Published on Jan 11, 2022 10:20 pm IST

గత ఏడాది వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ గా నిలిచిన వన్ అండ్ ఓన్లీ సినిమా ఏదన్నా ఉంది అంటే అది మోస్ట్ అవైటెడ్ సినిమా “స్పైడర్ మ్యాన్ నో వే హోమ్” అని చెప్పాలి. మార్వెల్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ వచ్చిన అవైటెడ్ సినిమా ఇది. మరి వారి అంచనాలకు తగ్గట్టుగానే అదిరే అంశాలతో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మాత్రమే కాకుండా మన దేశంలో కూడా భారీ వసూళ్లు కొల్లగొట్టి మరో భారీ హిట్ గా నిలిచింది.

ఇక ఇప్పుడు కూడా అక్కడక్కడా థియేట్రికల్ రన్ ని కొనసాగిస్తున్న ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై లేటెస్ట్ సమాచారం బయటకి వచ్చింది. ఇక ఈ లేటెస్ట్ టాక్ ప్రకారం అయితే ఈ చిత్రం వచ్చే ఫిబ్రవరి 28న రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాని వారి నిర్మాణ సమస్య సోనీ కి చెందిన ఓటిటి ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కి తీసుకు రాబోతున్నట్టు లేటెస్ట్ సమాచారం. ఈ సినిమా ఓటిటి వెర్షన్ కోసం కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :