టాక్..”అఖండ” రిలీజ్ కి ఈ డేట్ అనుకుంటున్నారట!

Published on Oct 3, 2021 8:13 am IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న “అఖండ” కోసం అందరికీ తెలిసిందే. మాస్ లో మంచి అంచనాలతో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ఎపుడు నుంచో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయ్యితే నిజానికి ఈ దసరా రేస్ లోనే నిలవాల్సి ఉన్న ఈ చిత్రం బ్యాలన్స్ షూట్ నిమిత్తం కాస్త ఆలస్యం అయ్యింది. దీనితో ఈ ఫెస్టివల్ సీజన్ ని మిస్సయ్యిన ఈ చిత్రం మరో ఫెస్టివ్ కి టార్గెట్ చేస్తుందని తెలుస్తుంది. ఇంతకు ముందు మేము చెప్పినట్టుగానే దీపావళి రేస్ లో ఈ సినిమాని నిలపాలని మేకర్స్ అనుకుంటున్నారట.

అందులో భాగంగానే వచ్చే నవంబర్ 4న డేట్ ని లాక్ చెయ్యాలని చూస్తున్నట్టుగా నయా బజ్. ఇక దీనిపై అధికారిక క్లారిటీ రావడమే తరువాయి. మరి ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :