టాక్..”భీమ్లా నాయక్” నుంచి నెక్స్ట్ వచ్చేది ఈ క్రేజీ అప్డేట్.?

Published on Jan 6, 2022 12:07 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ల కాంబోలో యువ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ మసాలా డ్రామా “భీమ్లా నాయక్”. ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిపోయిన ఈ సినిమా రిలీజ్ కి దగ్గర అవుతుంది అనగా పలు కారణాల చేత వాయిదా పడింది.

ఇక ఎట్టకేలకు మళ్ళీ సినిమా ఫిబ్రవరి నెలలోనే రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ స్టిక్ అయ్యి ఉండగా ఆల్రెడీ పలు బిగ్ అప్డేట్స్ రావాల్సినవి కూడా ఆగాయి. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి నెక్స్ట్ వచ్చే కీలక అప్డేట్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఈసారి మేకర్స్ ఓ క్రేజీ అప్డేట్ ని రివీల్ చేస్తారట.

మరి అది ఈ సినిమాలో మరో మోస్ట్ అవైటెడ్ సాంగ్ అయినటువంటి ఫోక్ సాంగ్ అట. మరి పవన్ సినిమాలో ఒకటి లేదా రెండు పాటలని ఆలపించాడని ఒక రూమర్ కూడా ఉంది. అయితే ఇప్పుడు భీమ్లా నాయక్ నుంచి వచ్చే నెక్స్ట్ అప్డేట్ సాంగ్ కోసమే అయ్యుంటుందని లేటెస్ట్ టాక్ మరి దీనిని ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనేది చూడాలి.

సంబంధిత సమాచారం :