టాక్..మహేష్, ఎన్టీఆర్ ల ఎపిసోడ్ మళ్ళీ వాయిదా.?

Published on Oct 30, 2021 7:03 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా తెలుగు స్మాల్ స్క్రీన్ కి చెందిన మరో బిగ్గెస్ట్ రియాలిటీ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” చేస్తున్న సంగతి తెలిసిందే. విజయవంతంగా కొనసాగుతూ వెళుతున్న ఈ షో ఇటీవల దీని ఫైనల్ ఎపిసోడ్ షూట్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక ఇదిలా ఉండగా ఈ షోలో పలువులు సినీ తారలు కూడా అటెండ్ అవుతారు అని తెలిసిందే.

అలా ఇప్పుడు వరకు ఎంతో మంది రాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒక గ్రాండ్ ఎపిసోడ్ కి హాజరు కావడం జరిగింది. అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడో షూట్ కంప్లీట్ చేసుకొని దసరా కే టెలికాస్ట్ కావల్సి ఉంది కానీ తర్వాత సామ్ ఎపిసోడ్ ని ప్లాన్ చేసి దానిని టెలికాస్ట్ చేశారు. దీనితో ఇక మహేష్ తో ఎపిసోడ్ దీపావళికి షిఫ్ట్ అయ్యింది అని బజ్ రాగా ఇప్పుడు అది కూడా వాయిదా పడినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :