టాక్..పవన్ లైనప్ తో డిజప్పాయింట్ అవుతున్న ఫ్యాన్స్.?

Published on Mar 6, 2022 9:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా నటించిన లేటెస్ట్ సినిమా “భీమ్లా నాయక్” థియేటర్స్ లో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ మళ్ళీ తన సినిమా కెరీర్ లో సినిమాలు స్టార్ట్ చేసి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లు అనౌన్స్ చేస్తూ వచ్చారు. కానీ వాటిలో దాదాపు స్ట్రైట్ సినిమాలు ఉంటే తన అభిమానులు కాస్త ఊరట చెందారు.

తన కం బ్యాక్ సినిమా “వకీల్ సాబ్” ఓ రీమేక్ అయినా మిగతా సినిమాలు చూసి పర్లేదు అనుకున్నారు. కానీ మధ్యలో మరో రీమేక్ “భీమ్లా నాయక్” ని తీసుకొచ్చి క్విక్ ప్రాజెక్ట్ గా ఫినిష్ చేసేసారు. అయితే అది ఎలాగో మాస్ సినిమా కాబట్టి ఉండగా ఉండగా మంచి అంచనాలు వచ్చి ఓపెనింగ్స్ కూడా బాగానే దక్కాయి.

ఇక మిగిలిన స్ట్రైట్ సినిమా చెయ్యడానికి రెడీ అవుతాడు అనుకుంటే మళ్ళీ మధ్యలో ఇంకో రీమేక్ సినిమా చేయబోతున్నాడని టాక్ రావడంతో పవన్ అభిమానులు బాగా విచారం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా మందే పవన్ రీమేక్స్ లైనప్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వాటి బదులు కొత్త ప్రాజెక్ట్స్ చెయ్యొచ్చు కదా ప్రెజెంట్ ట్రెండ్ లో అవతల భాషలో సినిమాలు కూడా మన వాళ్ళు చూసేస్తున్నారు అలాంటప్పుడు రీమేక్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని వారి లోపల అభిప్రాయం. లేటెస్ట్ గా వైరల్ అవుతున్న రీమేక్ సినిమా వినోదయం పట్ల అయితే మరింత అసహనంలో ఉన్నారు. పవన్ తన స్టార్డం ని రీమేక్స్ కి మాత్రమే పరిమితం చేస్తుండడంతో చాలా మందే అయితే బాగా డిజప్పాయింట్మెంట్ లో ఉన్నారనే తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :