టాక్..పవన్ మరో రీమేక్ ఆల్రెడీ లాంచ్ అయ్యిపోయిందా.?

Published on Jun 25, 2022 1:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు దర్శకుడు జాగర్లమూడితో ఓ భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకొని వస్తున్న ఈ చిత్రం పవన్ కెరీర్ లో మోస్ట్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ గా వస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం లైన్ లో ఉండగానే మరిన్ని సినిమాలు స్టార్ట్ చేసిన పవన్ ఇప్పుడు మరో రీమేక్ కి ఓకే కూడా చెప్పారు.

ప్రముఖ నటుడు సముద్రఖని దర్శకత్వంలో తమిళ హిట్ వినోదయం కి రీమేక్ గా చేయనున్న ఈ సినిమా కోసం పవన్ సుమారు 20 రోజులు కేటాయించినట్టుగా టాక్ ఉంది. అయితే ఈ సినిమాపై గత కొన్ని రోజులు నుంచి టాక్ ఉంది కానీ ఇప్పుడు ఈ సినిమా ఆల్రెడీ లాంచ్ కూడా అయ్యిపోయినట్టుగా సమాచారం బయటకి వచ్చింది. ఇది ఊహించని అంశమే అని చెప్పాలి. మరి సినిమా ఎప్పుడు కంప్లీట్ అయ్యి రిలీజ్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :