టాక్..చరణ్ ఈ సినిమా కూడా వి మెగా లోనే.?

Published on May 30, 2023 7:07 am IST


ప్రస్తుతం గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తో భారీ పాన్ ఇండియా సినిమా “గేమ్ ఛేంజర్” అనే సబ్జెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి శంకర్ తన వింటేజ్ కమర్షియల్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై క్రేజీ హైప్ అయితే ఉంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా అప్పట్లో ఓ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే.

మరి ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే ఇది పలు కారణాల చేత వాయిదా పడగ లేటెస్ట్ గా చరణ్ అయితే వారితో కొలాబరేట్ అయ్యి వి మెగా పిక్చర్స్ అనే సరికొత్త బ్యానర్ ను స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు యూవీ క్రియేషన్స్ కి ఇచ్చిన ఆ సినిమాని ఈ బ్యానర్ లో అయితే ఇప్పుడు చేయనున్నాడని కొన్ని రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :