టాక్..ఈ యంగ్ హీరోతో చరణ్ ప్రొడక్షన్ లో సినిమా.?

టాక్..ఈ యంగ్ హీరోతో చరణ్ ప్రొడక్షన్ లో సినిమా.?

Published on May 27, 2023 4:08 PM IST


ప్రస్తుతం గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “గేమ్ చేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ భారీ సినిమా షూటింగ్ లో చరణ్ ఇంకా బిజీగా ఉండగా ఈ చిత్రంతో పాటుగా రామ్ చరణ్ రీసెంట్ గానే ఓ సరికొత్త ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ వారితో కలిసి స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

వి మెగా క్రియేషన్స్ లో అయితే పలు ఆసక్తికర సినిమాలు తీసుకురానుండగా ఇప్పుడు ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని ఓ యంగ్ హీరోతో ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. మరి ఈ యంగ్ హీరో అయితే నిఖిల్ సిద్ధార్థ్ కాగా తనతో ఈ బ్యానర్ లో చరణ్ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేయనున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది.

ఆల్రెడీ నిఖిల్ కార్తికేయ 2 తో పాన్ ఇండియా మార్కెట్ లో సత్తా చాటాడు. నెక్స్ట్ ఇపుడు “స్పై” తో కూడా సిద్ధం అవుతున్నాడు. ఈ క్రమంలో అయితే అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని వీరు మేక్ చేయనున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ త్వరలోనే రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు