టాక్..”సూర్య 42″ టీజర్ అప్పుడే.?

Published on Mar 21, 2023 2:00 pm IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మరో భారీ సినిమా తన కెరీర్ లో అయితే 42వ సినిమాగా తెరకెక్కుతుంది. మరి ఈ భారీ సినిమాని దర్శకుడు శివ తెరకెక్కిస్తుండగా సూర్య కెరీర్ లోనే ఈ సినిమా రికార్డు బడ్జెట్ మరియు రికార్డు బిజినెస్ ని చేసింది. దీనితో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొనగా ఇప్పుడు షూటింగ్ ని అయితే మేకర్స్ శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. మరి ఈ భారీ సినిమా పై లేటెస్ట్ మరో ఇంట్రెస్టింగ్ బజ్ అయితే వినిపిస్తుంది.

ఈ సినిమా నుంచి అతి త్వరలోనే టైటిల్ కార్డ్ అనౌన్స్ కానుండగా ఇక సినిమా అవైటెడ్ టీజర్ పై మరో ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. ఇక ఈ టీజర్ ని అయితే మేకర్స్ ఈ మే నెలలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట. దీనితో ఈ టీజర్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాలో హీరోయిన్ గా దిశా పటాని నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే యూవీ క్రియేషన్స్ మరియు గ్రీన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :