లేటెస్ట్..ఈ దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థకి “RRR” ఓటిటి హక్కులు.!

Published on Dec 11, 2021 3:05 pm IST

పాన్ ఇండియన్ వైడ్ ఇప్పుడు సాలిడ్ రీచ్ తో రిలీజ్ కి రెడీగా ఉన్న భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం వచ్చే నెలలో పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం ఓటిటి రిలీజ్ పై కూడా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా రిలీజ్ అయ్యిన 70 రోజులు వరకు ఓటిటి లో రాదని కన్ఫర్మ్ అయ్యింది. సరే మరి అసలు ఏ ఓటిటి సంస్థ వారు ఈ సినిమా హక్కులు దక్కించుకున్నారు? ఎందులో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది అనేది ఇప్పుడు తెలుస్తుంది.

ఈ చిత్రం తాలుకా ఓటిటి హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారట. అయితే ఇది ఒక్క హిందీ భాషలోనా లేక అన్ని భాషల్లోనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ కూడా ముందు రోజుల్లో రానుంది అని టాక్. మరేం కానుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :