టాక్..పవన్ ని మీట్ అవ్వనున్న ఈ సినిమా నిర్మాతలు.?

Published on Jul 3, 2022 1:04 am IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పలు సినిమాలు ఆల్రెడీ ఓకే చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరి వాటిలో పవన్ ఆల్రెడీ ఫస్ట్ లుక్ కూడా ఇచ్చేసిన సినిమాలు రెండు ఉన్నాయి. అవి ఒకటి దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కాగా మరొక చిత్రం దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “భవదీయుడు భగత్ సింగ్”.

మరి ఈ సినిమాల్లో ఇప్పుడు భవదీయుడు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పవన్ ని కలవడానికి రెడీ అయ్యినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. రీసెంట్ గానే పవన్ వారి నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం “అంటే సుందరానికీ” ప్రీ రిలీజ్ కి వెళ్లగా అక్కడ భవదీయడు సినిమా ఎపుడు మొదలైనా పర్వాలేదు అన్నట్టు తెలియజేసారు. మరి ఇప్పుడు మీట్ అవుతుండడం అనేది మరింత ఆసక్తిగా మారింది. మరి అది ఏ విషయానికి సంబంధించి అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :