టాక్..ఓటీటీ లో “బిచ్చగాడు 2” రాక అప్పుడే.?

Published on May 26, 2023 7:03 am IST

కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “బిచ్చగాడు 2” కోసం తెలిసిందే. కొన్నాళ్ల కితం వచ్చిన తన సెన్సేషనల్ హిట్ చిత్రం బిచ్చగాడు కి సీక్వెల్ గా రాగా భారీ అంచనాలతో తెలుగులో వచ్చి తమిళ్ లో కన్నా భారీ ఓపెనింగ్స్ అందుకుంది. ఇక తెలుగు లో సక్సెస్ ఫుల్ గా రెండో వారం లోకి అడుగు పెట్టిన ఓటీటీ డెబ్యూ కోసం ఇప్పుడు బజ్ తెలుస్తోంది.

మరి లేటెస్ట్ బజ్ ప్రకారం అయితే ఈ చిత్రం ఈ జూన్ మూడో వారంలో రానున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఓటీటీ హక్కులు ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ డిస్నీ+ హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా అందులో అయితే ఈ జూన్ మూడో వారంలో తెలుగు సహా తమిళ్ లో స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి దీనిపై అయితే అధికారిక డేట్ అండ్ క్లారిటీ రావాల్సి ఉన్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా విజయ్ ఆంటోనీ సంగీతం, దర్శకత్వం వహించాడు. అలాగే ఫాతిమా ఆంటోని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :