టాక్: “కల్కి 2898 ఎడి” ట్రైలర్ బ్లాస్ట్ అప్పుడే?

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా, దిశా పటాని యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ లాంటి లెజెండరీ నటుల కలయికలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న మాసివ్ పాన్ వరల్డ్ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ పై అంచనాలు ఇప్పుడు మరింత స్థాయికి వెళుతుండగా ఈ సినిమా అవైటెడ్ ట్రైలర్ కట్ కి సంబంధించి లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.

దీనితో ప్రభాస్ సినిమాలకి ఫాలో అవుతున్న ఫార్మాట్ లోనే దాదాపు మూడు వారాల ముందే ట్రైలర్ వచ్చేస్తుంది అని తెలుస్తుంది. అంటే ఈ జూన్ మొదటి వారంలోనే ఈ భారీ చిత్రం ట్రైలర్ రావచ్చని టాక్. మరి గతంలో సలార్ రిలీజ్ కి కూడా ముందు టీజర్ గ్లింప్స్, నెక్స్ట్ ట్రైలర్ తర్వాత యాక్షన్ ట్రైలర్ లు వచ్చాయి. ఇప్పుడు ఇదే తరహాలో కల్కి ట్రైలర్ కూడా రిలీజ్ కి 25 రోజుల గ్యాప్ ముందే వచ్చే ఛాన్స్ ఉన్నట్టు వినిపిస్తుంది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version