టాక్..”చరణ్ 16″ మొదలు అప్పుడు నుంచి.?

Published on Feb 16, 2023 10:00 am IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చరణ్ కెరీర్ లో 15 వ సినిమాగా అయితే తెరకెక్కుతూ ఉండగా ఇప్పుడు సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో కొనసాగుతుంది. ఇక నెక్స్ట్ ఈ సినిమా తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సానా తో అయితే చరణ్ చేయనున్న సంగతి తెలిసిందే.

ఆల్రెడీ అనౌన్స్ అయ్యిన ఈ చిత్రం భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా షూట్ కోసం చరణ్ ఎగ్జైటెడ్ గా ఉన్నానని బుచ్చిబాబు ని త్వరలోనే మీట్ అవుదాం అంటూ పెట్టిన పోస్ట్ కూడా ఆసక్తిగా మారింది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా షూట్ పై అయితే లేటెస్ట్ బజ్ అయితే తెలుస్తుంది.

దీని తో అయితే ఈ సినిమా ఈ ఏడాది చివరలో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందట. మేకర్స్ అయితే నవంబర్ లేదా డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారని అలాగే చరణ్ కూడా అప్పటికి ఫ్రీ అయ్యి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనున్నాడని తెలుస్తుంది. ఇక ఈ భారీ సినిమాపై మరిన్ని డీటెయిల్స్ రానున్నాయి.

సంబంధిత సమాచారం :