టాక్..వెంకీ మామ సినిమా మళ్ళీ ఓటిటి దిశగా.?

Published on Oct 6, 2021 10:01 am IST

రీసెంట్ గా ఓటిటి లో వచ్చి భారీ హిట్ గా నిలిచినటువంటి పలు చిత్రాల్లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఇంటెన్స్ చిత్రం “నారప్ప” కూడా ఒకటి. పలు కారణాల చేత నేరుగా ఓటిటిలోనే రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. కానీ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చెయ్యాలి అనుకున్న అభిమానులను మాత్రం నిరాశ పరిచింది.

ఇక ఇదిలా ఉండగా దీని తర్వాత వెంకీ మామ ఏ సినిమాలు కూడా ఓటిటి బాట పట్టకపోవచ్చు అందులో భాగంగానే “దృశ్యం 2” సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుంది అని బజ్ వచ్చింది. కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రం కూడా ఓటిటి కే ఫైనల్ ఓట్ వేసినట్టు తెలుస్తుంది.

ఆల్రెడీ ప్రముఖ ఓటిటి సంస్థ హాట్ స్టార్ తో డీల్ ని ఈ సినిమా ముగించుకున్నట్టు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాని కూడా మళయాళంలో దృశ్యం 2 ని తెరకెక్కించిన జీతూ జోసెఫ్ నే దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :