టాక్..”కేజీయఫ్ 2″ డేట్ కి విజయ్ అవైటెడ్ సినిమా..?

Published on Jan 15, 2022 3:02 am IST

ఈ ఏడాది వచ్చే సినిమాలు ఒక్కొక్కటి వేరే లెవెల్లో ఉన్నవే అని చెప్పాలి. రీజనల్ గా కొన్ని భారీ సినిమాలు ఉంటే వాటితో పాటు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఈ భారీ సినిమాలు అన్నీ కూడా మన సౌత్ ఇండియన్ సినిమా నుంచే ఎక్కువగా ఉన్నాయి.

అయితే మరి ఈ భారీ సినిమాల జాబితాలో కన్నడ నుంచి వస్తున్న “కేజీయఫ్ చాప్టర్ 2” కోసం పరిచయం చెయ్యక్కర్లేదు. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ ల కాంబోలో ఎప్పుడు నుంచో ఇండియన్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. అయితే ఈ సినిమా రిలీజ్ కి గాను మేకర్స్ ఆల్రెడీ ఏప్రిల్ 14 ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే సరిగ్గా ఇదే డేట్ కి గాను ఇళయ థలపతి విజయ్ నటించిన భారీ సినిమా “బీస్ట్” ఆ చిత్ర యూనిట్ సిద్ధం చేస్తున్నట్టుగా ఇప్పుడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయ్ సినిమా వస్తుంది అంటే తమిళనాట ఉండే హైప్ వేరే స్థాయిలో ఉంటుంది. మరి సరిగ్గా కేజీయఫ్ తోనే ఈ సినిమా రిలీజ్ కూడా అంటే బాక్సాఫీస్ దగ్గర వార్ గట్టిగానే ఉంటుందని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే ఈ రెండు సినిమాల డేట్స్ పైనే టాక్ హాట్ టాపిక్ గా నడుస్తుంది.

సంబంధిత సమాచారం :