విజయ్ “బీస్ట్” అప్పటికి చేంజ్ అయ్యిందా?

Published on Sep 23, 2021 3:00 am IST


తమిళ స్టార్ హీరో విజయ్ జోసెఫ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “బీస్ట్”. ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది.

అయితే ఈ చిత్రాన్ని తొలుత మేకర్స్ 2022 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారని, కానీ తాజాగా సమాచారం ప్రకారం ఈ చిత్రం 2022 సమ్మర్‌కి మారిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :