టాక్..విక్రమ్ “కోబ్రా” వాయిదా పడిందా.?

Published on Jul 21, 2022 8:01 am IST


కోలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్ డెడికేటివ్ స్టార్ హీరోస్ లో విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ కూడా ఒకరు. మరి విక్రమ్ హీరోగా ఇప్పుడు నటించిన రెండు భారీ సినిమాలు రిలీజ్ కి కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఈ చిత్రాల్లో దర్శకుడు జ్ఞ్యాన ముత్తు తో తెరకెక్కించిన చిత్రం “కోబ్రా” కూడా ఒకటి. మరి ఈ సినిమాలో విక్రమ్ ఎన్నో గెటప్స్ వేయగా మంచి అంచనాలు ఈ సినిమాపై అయితే ఉన్నాయి.

ఇక ఈ చిత్రం కూడా ఈ ఆగస్ట్ లోనే రిలీజ్ కి ఆల్రెడీ ఫిక్స్ కాగా ఇపుడు ఈ రిలీజ్ డేట్ నుంచి అయితే మేకర్స్ మళ్ళీ వెనక్కి తగ్గుతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. కారణం ఏమిటి అనేది ఇంకా తెలియరాలేదు కానీ సినిమా అయితే ఈ ఆగస్ట్ 11న రిలీజ్ కావట్లేదని తెలుస్తుంది. మరి ఇప్పటికే ఈ సినిమా చాలా ఆలస్యంగా వస్తుంది. మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పటికి వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో కేజీయఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :