శేఖర్ మాస్టర్‌తో కలిసి ‘కళావతి’ పాటకి స్టెప్పులేసిన తమన్..!

Published on Feb 22, 2022 11:34 pm IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన తొలి సాంగ్ “కళావతి”కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇందులో మహేశ్ బాబు వేసే హుక్ స్టెప్‌కు సోషల్ మీడియాలో రీల్స్ బాగా చేస్తున్నారు. రీసెంట్‌గా మహేశ్ కూతురు సితార కూడా ఈ స్టెప్‌ను అద్భుతంగా చేసి అలరించింది.

అయితే తాజాగా ఈ హుక్ స్టెప్‌ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా చేశాడు. కొరియోగ్రాఫర్ శేఖర్‌ మాస్టర్‌తో కలిసి తమన్ సిగ్గుతో స్టెప్స్ వేశాడు. ఈ వీడియోను తమన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోగా అది కాస్త వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు అదరగొట్టావ్, కుమ్మేశావంటూ కొందరు, నీ మల్టీ టాలెంట్‌కు హ్యాట్సాఫ్ అంటూ ఇంకొందరు.. తమన్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

సంబంధిత సమాచారం :