ట్రెండింగ్ : ఫ్యాన్స్ తో తమన్నా చిట్ చాట్ … ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడి

Published on Jul 5, 2022 8:00 pm IST

టాలీవుడ్ స్టార్ నటి తమన్నా భాటియా లేటెస్ట్ గా అనిల్ రావిపూడి తీసిన ఎఫ్ 3 మూవీ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకు వచ్చి దానితో సూపర్ హిట్ కొట్టారు. ఇక ప్రస్తుతం తెలుగులో గుర్తుందా శీతాకాలం, భోళా శంకర్ మూవీ చేస్తున్న తమన్నా తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆడియన్స్, ఫ్యాన్స్ తో పలు సినీ, వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం ముంబైలో తన లేటెస్ట్ మూవీ షూట్ లో పాల్గొంటున్న తమన్నా షూటింగ్ కోసం బయల్దేరుతున్న సమయంలో మార్గమధ్యంలో పడిన వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ, కొద్దిసేపు ఫ్యాన్స్ తో ట్విట్టర్ ద్వారా ముచ్చటించారు. ఆస్క్ తమన్నా పేరుతో పలువురు ఫ్యాన్స్ ఆడియన్స్ ప్రశ్నలు ఆమె సమాధానం ఇచ్చారు.

1. మీ లైఫ్ లో మీరు నేర్చుకున్న ముఖ్య అంశం ఏమిటి … ??
Ans : నిన్ను నువ్వు నమ్ము, ప్రతి ఒక్క క్షణాన్ని ఆస్వాదించడం.

2. మీరు దేనికి భయపడతారు .. ?
Ans : నేను తరచు కొన్ని విషయాలు మర్చిపోతుంటాను, అది ఒక్కోసారి భయంగా ఉంటుంది.

3. మీ ఫేవరెట్ ప్లేస్ న్యూ యార్క్ లేదా లండన్ … ??
Ans : న్యూ యార్క్

4. ఐస్ క్రీం లేదా చాకోలెట్ లో మీకు ఏది ఇష్టం … ??
Ans : చాకొలేట్ ఐస్ క్రీం

5. మీరు చేసిన క్యారెక్టర్స్ లో ఎప్పటికీ మీకు గుర్తుండిపోయేది … ??
Ans : ధర్మాదురై లో సుభాషిణి, అలానే బాహుబలి లో అవంతిక

6. మీకు ఇష్టమైన ఫిక్షనల్ క్యారేకర్స్ లో మీరు రియల్ లైఫ్ లో ఏ పాత్రని మీట్ అవుదాం అనుకుంటున్నారు …??
Ans : షెర్లాక్ హోమ్స్

7. స్కూల్, కాలేజ్ డేస్ లో మీ ఫేవరెట్ సబ్జక్టు .. ?
Ans : లిటరేచర్, కెమిస్ట్రీ, హిస్టరీ

8. 777 చార్లీ మూవీ చూసారా … ?
Ans : నేను చూడలేదు మా పేరెంట్స్ చూసి ఎంతో అద్భుతంగా ఉందని చెప్పారు.

9. మీ ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్ .. ?
Ans : అన్ని రకాల దోశలు

10. మీరు చేసిన క్యారెక్టర్స్ లో ఏది ఛాలెంజింగ్ గా అనిపించింది .. ??
Ans : ఎఫ్ 3 లో అబ్బాయిగా చేయడం కష్టం అనిపించింది, కానీ కష్టపడి ఎంజాయ్ చేస్తూ చేశాను.

సంబంధిత సమాచారం :