తన పెళ్లిపై క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చిన తమన్నా..!

Published on Apr 9, 2022 11:17 pm IST

మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. హ్యాపీడేస్ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన మిల్కీ బ్యూటీ దాదాపు సౌత్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. మునపటికంటే కాస్త అవకాశాలు తగ్గినప్పటికీ ఇంకా బిజీగానే లైఫ్ గడుపుతుంది తమన్నా.

అయితే త్వరలోనే తమన్నా పెళ్లి పీటక్కబోతుందంటూ, ఇప్పటికే కుటుంబ సభ్యులు వరుడిని కూడా చూశారని ఈ మధ్య బయట గట్టిగానే టాక్ నడుస్తోంది. కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. నేను పెళ్లి తప్పకుండా చేసుకుంటానని అయితే దానికి ఇంకా రెండేళ్ల సమయం ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికైతే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని.. ఇప్పుడు పూర్తిగా కెరీర్‌పైనే దృష్టి పెడుతున్నానని క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో మిల్కీ బ్యూటీ పెళ్లి పుకార్లకు ఫుల్ స్టాప్ పడినట్టు అయ్యింది.

సంబంధిత సమాచారం :