
వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా సంచలనాలు సృష్టిస్తూ.. బుల్లితెర వీక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న రియాలిటీ షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. సూపర్ సక్సెస్ అయిన మొదటి సీజన్ కి కొనసాగింపుగా కింగ్ నాగార్జున రెండవ సీజన్ మొదలుపెట్టారు. రెండవ సీజన్ కి కూడా అందరి చేత ఆదరాభిమానాలు అందుకుంటూ ముందుకు సాగుతోంది. నాగార్జున తర్వాత మీలో ఎవరు కోటీశ్వరుడులో అత్యంత ఆకర్షణీయమైన అంశం, తెలుగు సినీ ప్రముఖులు, హీరోయిన్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంటర్ టైన్ చెయ్యడం.
సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రసారం అయ్యే ఈ ప్రోగ్రాంలో ప్రతి శుక్రవారావు ఓ సెలబ్రిటీ వచ్చి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే రెండో సీజన్లో అనుష్క, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, వరుణ్ తేజ్, పూజా హెడ్గే, రెజీన తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మిల్క్ బ్యూటీ తమన్నాకి ఆ అవకాశం దక్కింది. తమన్నా ఇటీవలే మీలో ఎవరు కోటీశ్వరుడు షూటింగ్ లో పాల్గొంది. ఈ ఎపిసోడ్ ఈ నెల 13వ తేదీన ప్రసారం కానుంది. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో పాల్గొన్నారు.