విక్రమ్ ని మిస్సవుతున్నందుకు బాధపడిన తమన్నా !


మిల్కి బ్యూటీ తమన్నా కొద్దీ రోజులుగా తన సోదరుడి వివాహ కార్యక్రమాల్లో బిజీగా గడిపింది. ఇపుడు మరలా తన చిత్రాలపై దృష్టి సారించింది. తమన్నా ప్రస్తుతం విక్రమ్ హీరోగా నటిస్తున్న స్కెచ్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్ర షూటింగ్ త్వరలో పూర్తి కానుంది.

ఈ సందర్భంగా తమన్నా స్పందించింది. ”స్కెచ్ చిత్ర యూనిట్ తో కలసి పనిచేయడం ఓ అద్భుతమైన జర్నీ. విక్రమ్ సర్ ని మిస్సవుతున్నా” అని తమన్నా తెలిపింది. విజయ్ చందర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇది కాక మరో రెండు చిత్రాల్లో తమన్నా నటిస్తోంది.