నాని తో తమన్నా స్పెషల్ సాంగ్.. నిజమేనా ?

నాని తో తమన్నా స్పెషల్ సాంగ్.. నిజమేనా ?

Published on Oct 23, 2022 11:50 PM IST

నేచురల్ స్టార్ నాని హీరోగా దసరా అనే మూవీ రాబోతుంది. ఓదెల శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే, తాజాగా ఈ చిత్రంలో మరో స్పెషల్ ఐటమ్ సాంగ్ ఉందని తెలుస్తోంది. అయితే, ఈ సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. మరీ తమన్నా ఈ స్పెషల్ సాంగ్ కి అంగీకారం తెలుపుతుందో లేదో చూడాలి.

ఏది ఏమైనా తమన్నా – నాని కాంబినేషన్ అదిరిపోతుంది. అందుకే, ఈ రూమర్ వినిపించగానే అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది. సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వహబ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు