ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన తమన్నా.!

Published on May 21, 2023 1:05 am IST

ప్రస్తుతం స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా పలు ఇంట్రెస్టింగ్ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో అయితే లేటెస్ట్ మరో సాలిడ్ ప్రాజెక్ట్ కూడా ఆమెకి చేరింది అని కొన్ని రూమర్స్ వచ్చాయి. అదే నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి తో అయితే చేస్తున్న చిత్రం.

మరి ఈ సినిమాలో ఆల్రెడీ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ అలాగే మరో యంగ్ హీరోయిన్ శ్రీ లీల కూడా ఓ కీలక పాత్ర చేస్తుండగా తమన్నా కూడా ఈ చిత్రంలో ఉంది అంటూ కొన్ని రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఫైనల్ గా అయితే తమన్నా ఈ వార్తలపై స్పందించింది.

అనీల్ రావిపూడితో వర్క్ చేయడం నాకెంతో ఇష్టం అని అలాగే బాలకృష్ణ గారు అన్నా కూడా అపారమైన గౌరవం ఉందని కానీ నేను వారి సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నాను అనే వార్తలు పూర్తిగా అవాస్తవం అని కొట్టి పడేసింది. దీనితో ఈ వార్తలు విషయంలో ఎలాంటి నిజం లేదని అధికారిక క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :