బాలీవుడ్ సినిమాలో నటించనున్న తమన్నా !


‘హిమ్మత్ వాలా, తుటాక్ తుటాక్ తూటియా’ వంటి పలు హిందీ సినిమాల్లో నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా మరో బాలీవుడ్ చిత్రంలో నటించేందుకు సిద్దమవుతోంది. స్టార హీరో జాన్ అబ్రహం నటించనున్న ‘చోర్ నికల్ కే భాగ’ సినిమాలో తమన్నా నటించనుంది. అయితే హీరోయిన్ గా కాదు కథలోని ఒక ముఖ్యపాత్రలో. ఈ పాత్రలో తమన్నా ఎయిర్ హోస్టెస్ గా కనిపించనుందని హిందీ సినీ వర్గాల సమాచారం.

ఈ చిత్రాన్ని అమర్ కౌశిక్ డైరెక్ట్ చేస్తుండగా జేఏ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి జాన్ అబ్రహం నిర్మిస్తున్నారు. పలు సార్లు ప్రయత్నించినా ఇప్పటి వరకు హిందీలో సరైన సక్సెస్ అందుకోలేకపోయిన తమన్నా ఈ థ్రిల్లర్ తోనైనా మెప్పించాలని భావిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఆమె నటించిన ‘బాహుబలి – 2’, శింబు సరసన చేసిన ‘అన్బవన్ అసర్దవన్ అదంగదవన్’ చిత్రాలు రిలీజుకు సిద్ధంగా ఉండగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘పెళ్లిచూపులు’ రీమేక్ లో, నటి రేవతి దర్శకత్వం వహిస్తున్న ‘క్వీన్’ రీమేక్ లో నటిస్తోంది.