విక్రమ్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన తమన్నా !

7th, February 2017 - 02:39:00 PM


విలక్షణ నటుడు విక్రమ్ ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ధృవ నచ్చత్తిరమ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. దీంతో విక్రమ్ విజయ్ చందర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు. ఈ నెల 10 నుండి ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ మొదలవుతుంది. మొదట ఈ ప్రాజెక్టులో విక్రమ్ జోడీగా
‘ప్రేమమ్’ ఫేమ్ సాయి పల్లవిని అనుకున్నారు.

కానీ డేట్స్ కుదరకపోవడంతో ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. తరువాత ఆమె స్థానంలో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుందని వార్తలొచ్చాయి. వీటిపై స్పందించిన తమన్నా విక్రమ్ సినిమాలో నటిస్తున్న మాట వాస్తవమేనని రూడీ చేశారు. అలాగే సినిమా స్టోరీ లైన్ కమర్షియల్ ఫార్మాట్ లో చాలా బాగుందని, తన పాత్ర కూడా అద్భుతంగా ఉందని, కానీ ఇప్పుడే దాని గురించే ఏమీ చెప్పలేనని అన్నారు. అలాగే మార్చి నుండి షూట్లో పాల్గొంటానని, మొదటిసారి విక్రమ్ తో నటించడం చాలా ఎగ్జైటింగా ఉందని అన్నారు. ఇకపోతే ఈ చిత్రంలో ‘రేసు గుర్రం’ ఫేమ్ రవి కిషన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.