తమన్నా తమిళంలో చేయకపోయినా తెలుగులో చేసేలా ఉంది!


కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో 2014లో రూపొందిన చిత్రం ‘క్వీన్’. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రస్తుతం తమిళం, తెలుగులో రీమేక్ చేయనున్నారు. ముందుగా తమిళ రీమేక్ హక్కుల్ని కొన్న నటుడు, నిర్మాత త్యాగరాజన్ తమన్నాతో ప్రాజెక్ట్ చేద్దామనుకున్నారు కానీ రెమ్యునరేషన్ వద్ద సమస్య తలెత్తడంతో ఆమెను పక్కనబెట్టి కాజల్ తో చేయాలని నిర్ణయించుకున్నారు.

అలా తమిళ క్వీన్ లో నటించే ఛాన్స్ పోగొట్టుకున్న తమన్నాకు ఇప్పుడు తెలుగు రీమేక్లో నటించే అవకాశం దొరికెట్టుందని సమాచారం. ‘మిస్సమ్మ, షో’ వంటి భిన్నమైన చిత్రాలతో ఆకట్టుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ ఈ రీమేక్ ను డైరెక్ట్ చేస్తారట. ప్రస్తుతం స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తున్న అయన ప్రధాన పాత్ర కోసం తమన్నాను తీసుకోవాలనే యోచనలో ఉన్నారట. ఒకవేళ ఈ వార్త నిజమైతే ఇక్కడైనా తమన్నా రెమ్యునరేషన్ ఇబ్బందులేవీ లేకుండా సినిమా చేస్తారో లేదో చూడాలి.