రజనీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళ హీరో!

sarath-kumar
తమిళంలో నటుడిగా మంచి గుర్తింపు ఉన్న శరత్ కుమార్, రాజకీయ కార్యకలాపాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే రాజకీయపరంగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వివాదాలను కొని తెచ్చుకుంటారాయన. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్‌పై ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. రజనీ రాజకీయాల్లోకి వస్తానంటే, రావొద్దనే చెబుతానని శరత్ కుమార్ అన్నారు. అదేవిధంగా జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.

ఒక తమిళ వ్యక్తి మాత్రమే తమిళనాడుకు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని, రజనీని తమిళనాడుకు ముఖ్యమంత్రి ఊహించకూడదని అన్నారు. రజనీ పార్టీ పెట్టకపోవడమే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక దీంతో శరత్ కుమార్‌పై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. రజనీ అభిమానులు కొందరు శరత్ కుమార్‌ దిష్టిబొమ్మలను సైతం దహనం చేస్తున్నారు. మరి ఈ వివాదానికి శరత్ కుమార్ ఎలా ఫుల్‌స్టాప్ పెడతారో చూడాలి.