ఆస్కార్ బరిలో నిలిచిన తమిళ చిత్రం

tamil
ప్రతి సంవత్సరం నిర్వహించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఫారిన్ ఫిలిం కేటగిరీలో భారత్ తరపున కూడా ఓ సినిమాని ఎంపిక చేసి పంపుతారు. ఈ ఎంపికను ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చేపడుతుంది. ఈ ఫెడరేషన్ ఈ సంవత్సరం భారత్ తరపున తమిళ చిత్రం ‘విశారణై’ ను ఆస్కార్ బరికి ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మెన్ కేతం మెహతా ప్రకటించారు.

ఓ ఆటో డ్రైవర్ తన స్వీయ అనుభవాలతో రాసిన ‘లాక్ అప్’ అనే నవల ఆధారంగా దర్శకుడు వెట్రి మారన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రముఖ నటుడు ధనుష్ నిర్మించనిన ఈ చిత్రంలో పోలీసుల అకృత్యాలు, లంచగొండితనం, న్యాయం ఓడిపోవడం వంటి అంశాలు ప్రస్తావించబడ్డాయి. 2016 ఫిబ్రవరి 5న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శలకుల మన్ననలను కూడా పొందింది. ఈ చిత్రం జాతీయ అవార్డు పొందడంతో పాటు 72వ వెనీస్ చిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శింపబడింది.