తారక్ కోసం వెయిట్ చేస్తున్న దర్శకుల లిస్టులో తమిళ టాప్ డైరెక్టర్

linguswamy
‘జనతా గ్యారేజ్’ హిట్ తరువాత తారక్ ఇమేజ్ తారా స్థాయికి చేరుకుంది. ఆయనతో సినిమా చేయాలని సీనియర్ దర్శకులు, యంగ్ డైరెక్టర్స్ కథలను సిద్ధం చేసుకుని ఆయనకు వినిపించే పనిలో ఉన్నారు. మొదట దర్శకుడు పూర్ జగన్నాథ్, తారక్ కు ఓ కథ చెప్పాడని కానీ అది పూర్తి స్థాయిలో చెప్పలేదని, ‘ఇజమ్’ పనులు పూర్తయ్యాక మిగతా సంగం చెబుతాడని అప్పుడు తారక్ కు నచ్చితే ఆ ప్రాజెక్ట్ పట్టాలపైకి వెళుతుందని తెలుస్తోంది.

అలాగే ‘పటాస్’ తో హిట్ అందుకుని ‘సుప్రీం’ తో దర్శకుడిగా తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అనిల్ రావిపూడి కూడా తారక్ కు ఒక యాక్షన్ ఎంటర్టైనర్ కథను చెప్పాడని వార్తలు వస్తున్నాయి. ఇక వీరిద్దరూ కాక తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి కూడా తారక్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే ఓ మంచి యాక్షన్ కథను కూడా వినిపించి జూనియర్ అంగీకారం కోసం ఎదురుచూసున్నాడట. ఇక వీరందరిలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది తారక్ చేతిలోనే ఉంది.