సక్సెస్ మీట్‍లో కన్నీళ్ళు పెట్టుకున్న దిల్‌రాజు హీరో!

12th, October 2016 - 04:44:25 PM

siva-karthikeyan
వరుస విజయాలతో తమిళంలో సరికొత్త స్టార్ హీరోగా అవతరించిన శివ కార్తికేయన్ నటించిన ‘రెమో’ అన్న తమిళ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెలుగులో అదేపేరుతో డబ్ చేస్తోన్న విషయం తెలిసిందే. తెలుగులో వచ్చే నెలలో విడుదల కానున్న ఈ సినిమా తమిళనాట దసరా కానుకగా గత వారమే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. శివకార్తికేయన్ ఓ హిజ్డా తరహా పాత్రలో కనిపించడంతో భారీ క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతోంది.

ఈ నేపథ్యంలోనే నిన్న చెన్నైలో టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ మీట్‌లో మాట్లాడుతూ శివ కార్తికేయన్ ఎమోషనల్ అయ్యారు. తన సినిమాను అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నించారని, ఎవరు తన సినిమాను విడుదల కాకుండా చేయాలనుకున్నారో తెలుసని, తన పని తాను చేసుకుంటూంటే ఎందుకిలా చేస్తారని ప్రశ్నిస్తూ శివ కార్తికేయన్ కన్నీళ్ళు పెట్టుకున్నారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఆర్.డీ.రాజా నిర్మించారు.