నాగ చైతన్య సినిమాలో తమిళ స్టార్ !
Published on Sep 26, 2017 8:45 am IST


‘యుద్ధం శరణం’ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల్ని పలకరించిన అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం ‘సవ్యసాచి’ ని మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. యువ దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘ప్రేమమ్’ భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి.

అంతేగాక టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విభిన్నంగా ఉండటంతో సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాలో ప్రముఖ తమిళ నటుడు మాధవన్ నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు చందు ఇప్పటికే మాధవన్ కు స్క్రిప్ట్ వినిపించారని ఆయన కూడా సినిమాను చేయడం పట్ల సుముఖంగానే ఉన్నారని అంటున్నారు. అయితే ఈ వార్త ఎంతవరకు నిజం, ఒకవేళ నిజమైతే మాధవన్ సినిమాకి సైన్ చేస్తారా లేదా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలైన్ హ్యాండ్ సిండ్రోమ్ అనే లక్షణం కలిగిన కథానాయకుడి పాత్ర చుట్టూ నడిచే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

 
Like us on Facebook