
తమిళ స్టార్ హీరో శింబు తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం ఉన్నాడు. ఒక నటుడిగానే కాకుండా తెలుగులో పాటలు కూడా పాడి ఆడియన్స్ ని మెప్పించారు. తాజాగా శింబు ఓ డిఫరెంట్ ఫీట్ చేసాడు. అది కూడా తన శత్రువులపై కావడం విశేషం.. మనతో ఉంటూనే మనకే వెన్నుపోటు పొడిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా చేసేవాళ్ళని నేను వదిలేసినా, కర్మ అనేది ఒకటుంది అది మాత్రం వదలదు అని ట్వీట్ చేసాడు.
అంతే కాకుండా శింబు మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజతో కలిసి ఓ స్పెషల్ సాంగ్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. ఆ పాటని తనని అసహ్యించుకునే వారికి, తనకి వెన్నుపోటు పొడిచిన వారికి డెడికేట్ చేయనున్నారని తెలిపాడు ‘నా గురించి నెగటివ్, చీప్ న్యూస్ లు, వెన్నుపోటు పొడిచిన వారు, ఈర్ష చూపించే వారందరి కోసం ఓ స్పెషల్ సాంగ్ ని డెడికేట్ చేస్తున్నానని’ ట్వీట్ చేసాడు. చెప్పాలంటే తమ శత్రువులని ఏమీ అనకుండా వారిపై పోరు సాగించడం కొత్తగా ఉందని పలువురు అంటున్నారు.