సమంత స్పెషల్ సాంగ్‌పై పెరుగుతున్న వివాదం.. అదే కారణం..!

Published on Dec 17, 2021 1:33 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “పుష్ప”. డిసెంబర్ 17వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో సమంత ఐటం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు అన్ని భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది కానీ అదే రేంజ్‌లో వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ పురుషుల సంఘం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ పాటపై తమిళనాడులొని పురుష సంఘం కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘మగవాళ్ల బుద్ధే వంకర బుద్ధి” అనే లిరిక్స్ పాటలో ఉన్నాయని, ఈ పాటను తొలగించకుంటే సమంత, పాట ఆలపించిన ఆండ్రియా, గేయరచయిత వివేకా, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌పై కేసు పెడతామని హెచ్చరించింది. తెలుగులో ఈ పాటను చంద్రబోస్‌ రాయగా, తమిళంలో వివేకా రాశారు.

సంబంధిత సమాచారం :