తనీష్ కొత్త సినిమా ప్రారంభం..!

Taneesh-new-film-launched-i
దేవుళ్ళు సినిమా ద్వారా బాలనటుడిగా పరిచయమైన తనీష్, నచ్చావులే సినిమాతో హీరోగా పరిచయమై మంచి మార్కులు కొట్టేశాడు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ‘రైడ్’, ‘మేం వయసుకు వచ్చాం’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ వంటి సినిమాలు తనీష్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తాజాగా తనీష్ హీరోగా ఓ కొత్త చిత్రం ప్రాంభమైంది. రామానాయుడు స్టూడియోలో కొత్త సినిమా ఈ రోజే లాంచ్ అయింది.

శ్రీ చీరాల మూవీస్ పతాకపై శ్రీనివాస్ యాదవ్ ఈ సినిమాను నిర్మించనున్నారు. సంజీవ్ మేగోటి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం కూడా సంజీవే సమకూర్చారు. ఇక ఈ సినిమాలో తనీష్ సరసన మోహిత హీరోయిన్‌గా నటిస్తోంది. హవీష్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను వెంకటేష్ నిర్వహిస్తున్నారు.