
కమెడియన్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించిన సునీల్ హీరోగా మారి మొదట్లో మంచి హిట్ సినిమాలు చేసాడు. కానీ కొద్ది రోజులుగా సరైన హిట్ లేక డీలా పడిపోయాడు. ప్రస్తుతం తనికెళ్ళ భరణి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అంతే కాకుండా మారుతి, గోపి మోహన్ లతో కూడా సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఫ్లాపుల్లో ఉన్న సునీల్ మరో ఫ్లాప్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చాడని సమాచారం. అతనెవరో కాదు ‘జోష్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వాసు వర్మ. దిల్ రాజు నిర్మించే అవకాశం ఉన్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథ సునీల్ బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుందని సమాచారం. ఈ సినిమా అక్టోబర్ లో మొదలయ్యే అవకాశం ఉంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.