కొత్తగా అనిపిస్తున్న “మరో ప్రస్థానం” ట్రైలర్!

Published on Sep 17, 2021 11:02 am IST


యంగ్ హీరో తనీష్ అల్లాడి హీరోగా చాలా కాలం తర్వాత వస్తున్న లేటెస్ట్ చిత్రం “మరో ప్రస్థానం”. దర్శకుడు జానీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే వారం రిలీజ్ కి రెడీగా ఉండగా దానికి సంబంధించిన తాజా ట్రైలర్ బయటకి వచ్చి మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది. అయితే మొదటి నుంచి కూడా సింగిల్ షాట్ సినిమా అంటూ మేకర్స్ మంచి బజ్ ను ఈ సినిమాపై తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

మరి అది ట్రైలర్ లో కనిపిస్తుంది. ఒక కెమెరాతో నటీనటులపై దృశ్యాలను అత్యంత సహజంగా చిత్రీకరించనట్టు ఈ ట్రైలర్ లో కనిపిస్తుంది. ఇది ఒకింత కొత్తగా అనిపించే అంశం అని చెప్పొచ్చు. అలాగే ఇందులో తనీష్ సహా ఇతర నటీనటుల సహజ నటన మంచి యాక్షన్ బ్లాక్ లు అలాగే డైలాగ్స్ కూడా బాగున్నాయి.

మొత్తంగా మాత్రం ఇంటెన్స్ గా హార్డ్ హిట్టింగ్ గానే ఉంది కానీ స్టోరీ ట్రైలర్ దృష్ట్యా కన్ఫ్యూజన్ గానే ఉంది మరి దానికి సరైన సమాధానం మేకర్స్ వచ్చే సెప్టెంబర్ 24 రిలీజ్ తో ఇస్తారేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందివ్వగా మిర్త్ మీడియా వారు నిర్మాణం వహించారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :