‘తను.. వచ్చేనంట..’ ఫస్ట్‌ లుక్‌

27th, February 2016 - 12:17:05 AM

tanu-vachinata
తేజ కాకుమాను, రేష్మి గౌతమ్‌, ధన్యబాలకృష్ణన్‌ నటీనటులుగా రూపొందుతున్న చిత్రం ‘తను.. వచ్చేనంట’. వెంకట్‌ కాచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీఅత్చ్యుత ఆర్ట్స్‌ పతాకంపై చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల నిర్మిస్తున్నారు. టాకీ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రచయిత, దర్శకుడు బివిఎస్‌ రవి చేతుల మీదుగా శుక్రవారం విడుదల చేశారు.

నిర్మాత చంద్రశేఖర్‌ ఆజాద్‌ మాట్లాడుతూ…
ప్రస్తుతం లవ్‌ స్టోరీలతోపాటు హారర్‌, కామెడీ సినిమాల హవా ఎక్కువగా నడుస్తుంది. అలాగే మన ప్రేక్షకులు సెంటిమెంట్‌ కథల్ని కూడా బాగా ఆస్వాదిస్తారు. జోమెడీ జోనర్‌ సినిమా అంటే ఏంటో మా సినిమాతో పరిచయం చేస్తున్నాం. కథ, కథనం కొత్తగా ఉంటాయి. రేష్మి పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. ఇటీవల చేసిన షెడ్యూల్‌తో టాకీ పార్ట్‌ పూర్తయింది. మూడు పాటలు చిత్రీకరించాల్సి ఉంది. త్వరలో పాటల్ని కూడా అందమైన లొకేషన్లలో తెరకెక్కిస్తాం. చంటి, శివన్నారాయణ; ఫిష్‌ వెంకట్‌ పాత్రలు ఆద్యంతం వినోదాన్ని పంచుతాయి. ది బెస్ట్‌ అవుట్‌పుట్‌ కోసం దర్శకుడు అనుక్షణం కష్టపడుతున్నారు. ఆర్టిస్ట్‌ల సహకారం బావుంది. మా బ్యానర్‌కు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది అని తెలిపారు. హీరోగా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నాననీ హీరో తేజ చెప్పారు.

ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ : బెక్కం రవీందర్, ఎడిటర్ : నందమూరి హరి, ఆర్ట్ డైరెక్టర్ : సిస్తల శర్మ, ఛాయాగ్రహణం : రాజ్ కుమార్, సాహిత్యం : వశిష్ఠ శర్మ, సంగీతం : రవిచంద్ర, సహ నిర్మాత : లావు శ్రీమన్నారాయణ, పి.యశ్వంత్, కథ – నిర్మాత : చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల, స్క్రీన్ ప్లే – దర్శకత్వం : వెంకట్ కాచర్ల.