‘భోగన్’ తెలుగు రీమేక్లో తాన్య హోప్ !

12th, September 2017 - 12:48:06 PM


శ్రీ విష్ణు యొక్క ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన నటి తాన్య హోప్ ఆ తర్వాత జగపతిబాబు నటించిన ‘పటేల్ సర్’ సినిమాలో ఒక కీ రోల్ చేసి అందరినీ మెప్పించింది. చిన్న చిన్న ఆఫర్స్ చేతిలో ఈ హీరోయిన్ కి తాజాగా ఒక పెద్ద ప్రాజెక్ట్ నుండి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అదే మాస్ మహారాజ రవితేజ చేయనున్న ‘భోగన్’ చిత్రం.

తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రంలో హన్సిక, అక్షర గౌడ హీరోయిన్లుగా నటించారు. తాన్య హోప్ ఈ ఇద్దరిలో అక్షర గౌడ ఒయాత్రను చేయనున్నట్లు సమాచారం. తమిళ వెర్షన్లో అక్షర గౌడ రోల్ చిన్నదే అయినప్పటికీ మంచి ప్రశంసలను అందుకుంది. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన లక్ష్మణ్ ఈ తెలుగు రీమేక్ ను కూడా డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన హీరోయిన్ గా క్యాథరిన్ థ్రెస నటించనుండగా దసరా తర్వాత సినిమా మొదలవుతుందని సమాచారం.